Why Scorpion Festival In Yaadgir village, Karnataka is celebrated ?<br />#Yaadgir<br />#Karnataka<br /><br />ఆగష్టు 13వ తేదీ దేశం యావత్తు నాగపంచమి పండగను జరుపుకుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో నాగదేవతకు పూజలు చేశారు భక్తులు. దేశమంతా నాగుల పంచమి వేడుకలు చేస్తుంటే అదే రోజున కర్నాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో మాత్రం తేళ్ల పంచమి జరుపుకుంటున్నారు. ఇదేంటి తేళ్ల పంచమేంటి అని మీకు డౌటు రావొచ్చు.. కానీ అది నిజం. ఈ గ్రామంలో ఏ బండరాయిని ఎత్తినా కుప్పలు తెప్పలుగా తేళ్లు దర్శనమిస్తాయి. సాధారణంగా తేలు మనిషిని కుడితే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. కానీ కందుకూరులో సంచరించే తేళ్లు మాత్రం కుట్టవని అక్కడి స్థానికులు చెబుతుంటారు.